టీడీపీ ఎమ్మెల్యే భాష్యం పేరుతో ఇసుక, రేషన్‌ అక్రమాలు ?

-

పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా పేరు చెప్పి ఇసుక రీచ్ లు , రేషన్ షాపు లలో అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిసిందని.. పార్టీ వారు ఎవరైనా అలాంటి పనులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. అలాంటి అక్రమాలు చేసే వారితో, నాకు సంబంధం లేదని వెల్లడించారు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్.

Sand and ration irregularities in the name of TDP MLA Bhashyam

నియోజకవర్గంలో అలాంటి పనులు చేసే వారిపై అధికారులు చర్యలు తీసుకోండి…. అక్రమ పనుల కోసం నా పేరు వాడితే, అధికారులు వెంటనే నాకు ఫోన్ చేయండని కోరారు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. అధికారులు లంచాలు అడిగినా, ప్రజలు టిడిపి నాయకులు నాకు నేరుగా ఫోన్ చేయొచ్చు అన్నారు. పారదర్శక పాలన ఉండాలనేది నా ఆలోచన.. డబ్బుల కోసం ప్రజలను ఆఫీసుల చుట్టూ తిప్పితే , మీ ఆఫీసులకు నేనే వస్తా… అంటూ హెచ్చరికలు జారీ చేశారు పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్…

Read more RELATED
Recommended to you

Latest news