ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకూమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న విషయం నా మనసును కలిసివేసిందని మండిపడ్డారు. ఇలాంటి నేరం ఎవరు ఎప్పుడు భగవంతుడు విషయంలో పాల్పడి ఉండరని ఆగ్రహించారు. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుండి జగన్ తిరుమల పవిత్రతను తగ్గించేప్రయత్నం చేశారుని తెలిపారు. టిటిడి రాజకీయ కార్యకలాపాలజు వాడుకున్నారని… అన్య మతస్తుడినీ టిటిడి చైర్మన్ గా నియమించారని బాంబ్ పేల్చారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకూమార్.
పెద్ద ఎత్తున అవినీతి చేస్తూ స్వామీ వారి ఆస్తులను తెగనమ్మడానికి ప్రయత్నం చేశారని… క్షమించిరాని నేరం చేశారమన్నారు. కమీషన్ల కోసం లడ్డు ప్రమాదంలో నాసిరకం నెయ్యి తీసుకుని వచ్చారు..ఒక కేజీ మూడు వందల రూపాయల వరకు వచ్చేలా అవినీతి చేశారని ఆగ్రహించారు. అ అవినీతి సోమ్ము జగన్ ఖాతలోకి వెళ్లిందని… సమగ్ర విచారణ తరువాత జగన్ సహా ఇతర మాజీ చైర్మన్ లను జైలు కు పంపాలని కోరారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యకూమార్.