దేవర మూవీ విజయంపై కొరటాల షాకింగ్ కామెంట్స్

-

సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో ‘దేవర’ తొలి స్థానంలో ఉంది. ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న మూవీ కావడంతో ‘దేవర’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ మూవీ విజయంపై దర్శకుడు కొరటాల శివ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు తెలిపారు. దేవర సినిమా ఘన విజయం పొందాలని తిరుమల శ్రీవారిని కోరుకున్నట్లు డైరెక్టర్ కొరటాల శివ తెలిపారు. ‘ప్రతి సినిమాకు ముందు స్వామివారిని దర్శించుకోవడం అలవాటు. ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఉంటుందన్నారు. సక్సెస్ మీట్ లొకేషన్ ఇంకా ఫిక్స్ కాలేదన్నారు. దేవర మూవీ విజయంపై దర్శకుడు చాలా నమ్మకంతో ఉండటంతో మూవీ తప్పక విజయం సాధిస్తుందని ఎన్టీఆర్ అభిమానులు ఆశాభావం వ్యక్తంచేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version