రాజోలు వైసిపి మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరూ అంటున్నట్లు EVM లు టాంపరింగ్ జరగలేదు మూడు పార్టీల కలయిక వల్లే కూటమి గెలిచిందని వ్యాఖ్యానించారు రాజోలు వైసిపి మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. ఇవాళ మీడియాతో రాజోలు వైసిపి మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మాట్లాడుతూ… 2,70 వేల కోట్లు సంక్షేమ పథకాలు ద్వారా ప్రజలకు అందించిన సంక్షేమానికి ప్రజలు ఓటు వేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
కూటమి హామీలు వృద్ధాప్య పెన్షన్ 4000 ఇస్తారని, వికలాంగులకు 6000 ఇస్తారనే ఆశతో ప్రజలు ఓటు వేశారన్నారు రాజోలు వైసిపి మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. చంద్రబాబు నాయుడు సీనియర్ నాయకుడు హామీలన్నీ నెరవేర్చిన నెరవేర్చ వచ్చు అంటూ హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు. బిల్డింగులు కూల్చడం అనేది ఏ పార్టీ చేసిన తప్పే అంటూ పేర్కొన్నారు ఎమ్మెల్యే రాపాక.