ఏపీ సీఎం చంద్రబాబుకు ఆర్థిక శాఖ మాజీ మంత్రి యనమల లేఖ రాశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. జగన్ ప్రభుత్వంలోని అవినీతి వ్యవహారాలు.. చేపట్టాల్సిన చర్యలపై సంచలన సూచనలు చేసిన యనమల…. అవినీతిపరుల దిగమింగిన సోమ్మను తిరిగి రాబట్టేలా ప్రత్యేక చట్టం చేయాలని లేఖలో ప్రస్తావించారు. వైసీపీ నేతలు మింగేసిన డబ్బును రెవెన్యూ రికవరీ చట్టo అమలు, లేదా ఏదైనా ఇతర ప్రత్యేక చట్టం ద్వారా తిరిగి రాబట్టాలని… జగన్ ప్రభుత్వo గత ఐదేళ్లలో చేసిన ఆర్థిక నష్టాన్ని అధిగమించేందుకు మన ప్రభుత్వం చేపట్టిన, సానుకూల పురోగతి చర్యలు అభినందనీయం అని లేఖలో పేర్కొన్నారు.
మాజీ ఆర్థిక మంత్రిగా నా అనుభవంతో 15 అంశాలను సూచిస్తున్నానని… ఈ సూచనలు ఎన్నికల మేనిఫెస్టో అమలుకు.. రాష్ట్ర ఖజానాను మెరుగుపరుస్తుందని భావిస్తున్నానని చెప్పారు. పన్ను ఆదాయాలను క్రమబద్ధీకరించాలి…. కేంద్రం నుంచి ఎక్కువ డెవల్యూషన్ వచ్చేలా చూడాలని కోరారు. సహేతుకమైన స్థిరమైన రుణాలు తీసుకోవాలి…. ఇప్పుడు కంటే ఎక్కువ గ్రాంట్-ఇన్-ఎయిడ్ కోసం కేంద్రాన్ని కోరాలని వెల్లడించారు. మూలధన వ్యయంలో లీకేజీలను అరికట్టాలి…ఆంధ్రప్రదేశ్‌ను పారిశ్రామిక గమ్యస్థానంగా మార్చాలని కోరారు.