విశాఖలో దారుణ ఘటన వెలుగుచూసింది. భర్త టార్చర్ తాళలేక నవవధువు వసంత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గోపాలపట్నం నందమూరి కాలనీలో చోటుచేసుకుంది. అశ్లీల వీడియోలు చూపించి తీవ్రంగా టార్చర్ చేశాడు భర్త నాగేంద్రబాబు. దీంతో తట్టుకోలేక ఊరివేసుకుంది వసంత. నాగేంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి జరిగిన నెల రోజుల నుంచే భార్యకు వేధింపులు మొదలయ్యాయని.. పర్వర్ట్ గా మారి భార్యను వేధించాడు నాగేంద్ర. ముఖ్యంగా పోర్న్ వీడియోలకి బానిసగా మారి భార్యతో వికృత చేష్టలకు పాల్పడ్డాడు. రోజూ ట్యాబ్లెట్లు వేసుకుని భార్యకు నరకం చూపించాడు నాగేంద్ర. అత్తింటివారే తన కూతుర్ని చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని మృతురాలి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. రోజు మాదిరిగానే గత రాత్రి కూడా ఫోన్ చేసిందని.. అయితే రేపు వచ్చి మాట్లాడాతామని చెప్పామని.. ఇంతలోనే వారి కుటుంబ సభ్యులు ఫోన్ చేసి ఆమె చనిపోయిందని చెప్పారని వెల్లడించింది.