బీజేపీ కేడీల పార్టీ…వాళ్లకు జగన్, బాబు మద్దతు ఇస్తున్నారని వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ…ఏపీకీ ప్రత్యేక హోదా ఇస్తానని తిరుపతి వేదికగా మోదీ హామీ ఇచ్చారు..5 సంవత్సరాలు సరిపోదు.. పది సంవత్సరాలు ఇస్తామని మోదీ హామీ ఇచ్చారన్నారు. పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతి వేదికగా మీరు ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీ ఏమైంది.. అంటూ ఫైర్ అయ్యారు. మీరు మోడీనా లేక కేడినా..? అంటూ విరుచుకుపడ్డారు షర్మిల.
ప్రత్యేక హోదా కోసం ముని కోటి అన్నే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. జగన్, చంద్రబాబులు కేడీల పార్టీకీ మద్దతు తెలుపుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదా రాకపోవడంతో ఏపీలో అభివృద్ధి ఆగిపోయ్యింది..ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు..పోలవరం నిర్మాణం పూర్తి కాలేదు..మెట్రో రైలు లేదని ఫైర్ అయ్యారు .వైసీపీ,టీడీపీ పార్టీలు బీజేపీకీ బానిసలు అయ్యాయి..ఏపీలో బీజేపీకీ ఒక్క ఎంపీ సీటు లేకపోయినా.. బీజేపీ ఇక్కడ రాజ్యమేలుతోందన్నారు.