2 రోజుల్లోనే కాంగ్రెస్ లో చేరనున్న వైఎస్ షర్మిల !

-

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే గారితో సమావేశమయ్యారని, జనవరి 10వ తేదీ లోపు వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె వై.యస్. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని భావించామని రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు.

Sharmila as the President of Andhra Pradesh Congress

కానీ ప్రస్తుత పరిస్థితులు పరిశీలిస్తే, నాగపూర్ నుంచి రాహుల్ గాంధీ గారు త్వరగా ఢిల్లీకి చేరుకుంటే ఒకటి రెండు రోజుల వ్యవధిలోనే ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయని అన్నారు. షర్మిల నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో పోటీ చేయనుందని తెలిపారు.

గతంలో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకును గంపగుత్తగా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ వైపు బదిలీ అయిందని, ఇప్పుడు షర్మిల గారి నాయకత్వంలో బదిలీ అయిన ఓటు బ్యాంకులో రాహుల్ గాంధీ గారు ఆశిస్తున్నట్లుగా 15% కాకపోయినా, ఎంతో కొంత మెరుగుపడే అవకాశం ఉందని రఘురామకృష్ణ రాజు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version