వీర్రాజు మామూలోడు కాదు ! లబోదిబోమంటున్న టీడీపీ ?

-

రాజకీయాల్లో ఎదురుదెబ్బలు తగలడం అనేది సర్వసాధారణం. ఇక 40 ఏళ్ల రాజకీయం అంటూ పదేపదే చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబు వంటి వారికి అయితే, ఇటువంటి ఎదురుదెబ్బలు తగిలాయి. అయితే ఎక్కడ ఏ ఎత్తు వేస్తే వర్కౌట్ అవుతుందో బాగా తెలిసిన పెద్దమనిషి కావడంతో ,  ఇప్పటి వరకు రాజకీయాల్లో సక్సెస్ అవుతూ వచ్చారు. ఇప్పుడు బలమైన అధికార పార్టీ వైసీపీ ని ఎదుర్కొంటూ బలంగా నిలబడుతున్నారు. కానీ ఎప్పటి నుంచో ఏపీ లో ఉన్నా, లేనట్టుగానే ఉంటూ వచ్చిన బిజెపి, గతంతో పోలిస్తే మరింత బలపడింది  అప్పట్లో బిజెపిలోని ఓ పెద్దమనిషి సహాయ సహకారాలతో, ఏపీలో బీజేపీ బలపడకుండా చేసుకోగలగడంలో బాబు సక్సెస్ అయ్యారని, ఆ విషయం గ్రహించే మోది, అమిత్ షా వంటి వారు ఆ పెద్దమనిషి ని ప్రత్యక్ష రాజకీయాలకు దూరం చేసి, బాబుకు చెక్ పెట్టారు అని రాజకీయ వర్గాల్లో గుసగుసలు నడిచాయి.
ఈ సంగతి పక్కనపెడితే, ఇప్పుడు ఏపీలో టీడీపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. రాజకీయంగా అధికార పార్టీని ఎదుర్కొంటూ, మళ్లీ అధికారం దక్కించుకోవాలంటే ఖచ్చితంగా బిజెపి అండదండలు ఉండాలనేది బాబుకు బాగా తెలిసిన విషయమే. అందుకే పదేపదే బిజెపి పెద్దలతో మంతనాలు చేస్తూ, ఆ పార్టీకి దగ్గర అయ్యేందుకు ప్రయత్నిస్తుండగా , ఏపీ బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం, టిడిపిని దెబ్బ తీయడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. ఏడ్డెం అంటే తెడ్డం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు టిడిపి బిజెపితో ఎంతగా పొత్తు పెట్టుకోవాలని చూస్తుందో,  అంత కంటే రెట్టింపు స్థాయిలో ఇబ్బంది పెట్టాలి అన్నట్టుగా వ్యవహరిస్తోంది. తాజాగా ఏపీ ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని చూస్తుండగా, ఏదో రకంగా ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా అడ్డుకోవాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోంది.
టిడిపి సైతం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని పట్టుబడుతుంది. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఎన్నికల సంఘానికి రాసిన లేక పై ఇప్పుడు బాబు మండిపడుతున్నారు. మరో రెండు నెలల పాటు ఎన్నికల ప్రక్రియను వాయిదా వేయాలని, ఓటర్ లిస్టులో పేరు నమోదు కోసం కనీసం రెండు నెలల గడువు ఇవ్వాలంటూ వీర్రాజు లేఖ రాయడం పై ఇప్పుడు టిడిపి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కేవలం వైసీపీ ప్రభుత్వానికి మేలు చేసేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారంటూ అగ్గిమీద గుగ్గిలం అవుతోంది. ఎవరు ఎన్ని రకాలుగా విమర్శలు చేసినా, వీర్రాజు మాత్రం టిడిపి అంతమే నా పంతం అన్నట్లుగా వ్యవహరిస్తుండడం, ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version