సోము రివర్స్ స్ట్రాటజీ.. జగన్‌కు బెన్‌ఫిట్ ..!

-

కొత్తగా ఏపీ బీజేపీకి అధ్యక్షుడుగా వచ్చిన సోము వీర్రాజు బాగా దూకుడు కనబరుస్తున్నారు. అధికార వైసీపీని సుతిమెత్తగా విమర్శిస్తూ, ప్రతిపక్ష టీడీపీపై విరుచుకుపడుతున్నారు. మామూలుగానే సోముకు, చంద్రబాబు అంటే పడదు. అందుకే అనుకుంటా ఏపీ బీజేపీ అధ్యక్షుడు అయిన బాబుపై ఫైర్ అవ్వడం మానలేదు. అలాగే జగన్‌పై ఒక్క విమర్శ చేయకుండా, పరోక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారు. తాజాగా కూడా అంతర్వేది ఘటనపై స్పందిస్తూ, గతంలో చంద్రబాబు ప్రభుత్వం కృష్ణా పుష్కరాల సమయంలో పలు హిందూ దేవాలయాలని కూల్చివేసిందని, వారికి హిందూత్వం గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు.

అసలు విడ్డూరం కాకపోతే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో అంతర్వేది ఘటన జరగడం ఏంటి ? సోము ఏమో చంద్రబాబుని తిట్టడం ఏంటి అనేది ఎవరికి అర్ధం కాలేదు. పైగా వైసీపీ నేతలతో పోటీ మరీ బాబుని తిడుతున్నారు. ఆయన అధ్యక్ష పీఠంలో కూర్చున్న దగ్గర నుంచి అదే పనిలో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం తప్పులని ఎత్తి చూపడం పక్కనబెట్టి, ఇప్పుడు కూడా చంద్రబాబే అధికారంలో ఉన్నట్లు సోము వ్యవహరిస్తున్నారు. మరి టీడీపీని టార్గెట్ చేసి ఇంకా వీక్ చేస్తే జగన్‌కు బాగా బెన్‌ఫిట్ అవుతుందనే ఉద్దేశంతో సోము నడుస్తున్నట్లు కనిపిస్తోంది.

పైగా ఈయన వచ్చాకే అమరావతి విషయంలో సంబంధం లేదని బీజేపీ నినాదం ఎత్తుకుంది. కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షుడుగా ఉన్న సమయంలో బీజేపీ అమరావతికి అనుకూలంగా తీర్మానం కూడా చేసింది. కానీ సోము ఎంటర్ అవ్వడమే రాజధానితో కేంద్రానికి సంబంధం లేదని పెద్ద స్టేట్‌మెంట్ ఇచ్చేశారు. ఏపీ విషయంలో బీజేపీ డబుల్ గేమ్ ఆడుతుందని దీని బట్టే అర్ధమవుతుంది. ఇక వారి టార్గెట్ కూడా టీడీపీని వీక్ చేయడమే అని తెలుస్తోంది. కానీ సోము చేసే ప్రయత్నాలు ఏ మాత్రం సఫలం కావని తెలుగు తమ్ముళ్ళు అంటున్నారు. మళ్ళీ ఎన్నికల్లో వారికి నోటా కంటే తక్కువే ఓట్లు వస్తాయని మాట్లాడుతున్నారు. అసలు సోము వార్డు మెంబర్‌గా గెలిస్తే చాలు అని అంటున్నారు. మ‌రి టీడీపీ వ్యాఖ్య‌ల‌పై సోము ఎలా రిటాక్ట్ ఇస్తారో ?  చూడాలి.

-vuyyuru subhash 

Read more RELATED
Recommended to you

Exit mobile version