ఎస్సీ వర్గీకరణ మీద మాట్లాడితేనే సబితాకు మైక్ ఇస్తా.. లేదంటే మైక్ ఇవ్వను అంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అప్పటి వరకు సబితా ఇంద్రారెడ్డికి మైక్ ఇచ్చేది లేదని తెలిపారు. అటు సభ ప్రారంభమైన నుంచి సభలో నినాదాలతో నిరసన తెలుపుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సబితా ఇంద్రారెడ్డి క్షమాపణలు చెప్పి.. మైక్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యేల డిమాండ్ పై పరిశీలించడం లేదు.
ఇక అటు బీఆర్ఎస్ సభ్యుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి. సభలో సభ్యులు ఇలా ప్రవర్తించడం సరి కాదన్నారు. సభలో ఉండటం ఇష్టం లేకుంటే వాకౌట్ చేయండని చురకలు అంటించారు. నిన్న కూడా బీ అర్ ఎస్ మెంబెర్స్ తీరు వల్లే మేము మాట్లాడే అవకాశం కోల్పోయామని ఆగ్రహించారు. రెండు రోజులే సమయం ఉంది …మాట్లాడాల్సిన సమస్యలు చాలా ఉన్నాయన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి.