వైసీపీ పార్టీకి షాక్.. అసెంబ్లీలో కూడా 11 నెంబర్ బ్లాక్ కేటాయించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. దీనికి సంబంధించిన ఫోటో వైరల్ చేస్తోంది టీడీపీ సోషల్ మీడియా. వాస్తవానికి అసెంబ్లీలో 11 నెంబర్ బ్లాకా.. లేక ఇతర బ్లాకా తెలియదు కానీ… 11 నెంబర్ లాగా మాత్రం కనిపిస్తోంది. అది ఎవరైనా ఎడిట్ చేశారా… లేక.. నిజంగానే… అసెంబ్లీలో కూడా 11 నెంబర్ బ్లాక్ కేటాయించారా అనేది తెలియాల్సి ఉంది. కానీ.. అసెంబ్లీలో కూడా 11 నెంబర్ బ్లాక్ కేటాయించారని వైసీపీ నేతలను ట్రోల్ చేస్తున్నారు.

ఇక ఈ సందర్భంగా మంత్రి అచ్చం నాయుడు మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కార్యక్రమాల ను గవర్నర్ తన ప్రసంగం లో ప్రస్తావించారని తెలిపారు. ఒక రాజకీయపార్టీ కేవలం అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చిందని… 60 రోజుల పాటు సభకు రాక పోతే సభ్యత్వం కోల్పోతాం అన్న భయం తోనే సంతకాలు చేసి వెళ్ళిపోయారని వెల్లడించారు. ఏ పార్టీ అయినా రాజ్యాంగానికి లోబడి ప్రవర్తించాలని…. అవినీతి అక్రమాల తో పుట్టిన ఓ పార్టీకి అసత్యాలు చెప్పటం ఆలవాటు అయిపోయిందని పేర్కొన్నారు.