మాజీ మంత్రి పిసిపె విశ్వరూప్ కు ఊహించిన ఎదురుదెబ్బ తగిలింది. మాజీ మంత్రి పిసిపె విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది. దళిత యువకుడు దుర్గాప్రసాద్ హత్య కేసులో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ముదురైలో ఉన్న శ్రీకాంత్‌ను అరెస్టు చేసి, అక్కడి న్యాయమూర్తి ముందుకు హాజరు పరిచినట్లు తెలుస్తోంది. ట్రాన్సిట్ వారెంట్ ద్వారా శ్రీకాంత్‌ను ఏపీకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.