మెక్ డొనాల్డ్స్ లో చెఫ్ గా మారిన ట్రంప్..!

-

అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. తాజాగా ట్రంప్ తన బిజీ షెడ్యూల్ నుంచి కొంత సమయం తీసుకున్నాడు. దీంతో పెన్సిల్వేనియాలోని మెక్ డొనాల్డ్స్ లో ఆగాడు. ఆ సమయంలో ఫ్రెంచ్ ప్రైస్ చేసేందుకు ప్రయత్నించాడు ట్రంప్. తనకు ఫ్రెంచ్ ఫ్రైస్ అంటా చాలా ఇష్టం అని తెలిపాడు. ఇక్కడ పని చేయడం కూడా చాలా ఇష్టమని వెల్లడించారు.

అదేవిధంగా కమల హ్యారీష్ కంటే 15 నిమిషాలు ఎక్కువ పని చేశానని ట్రంప్ పేర్కొన్నారు. ఇక ప్రస్తుతం ట్రంప్ ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముక్యంగా మెక్ డొనాల్డ్స్ ఉద్యోగులతో మాట్లాడటం.. ఫ్రైస్ చేయడం చూడవచ్చు. దీంతో అతను రెస్టారెంట్ డ్రైవ్-త్రూలో ప్రజలకు ఆహారం కూడా అందించాడు. ఈ సమయంలో అతను ఒక కుటుంబంతో కూడా మాట్లాడాడు. దీనికి మీరు డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని వారికి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version