శ్రీశైలం వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్. శ్రీశైలంలో నకిలి దర్శనం టికెట్ల కలకలం రేపింది. పాత దర్శనం టికెట్లను ఎడిట్ చేసి భక్తులను మోసం చేస్తున్నారు కేటుగాళ్లు…. ఈ ఘటన పై పీఎస్ లో ఫిర్యాదు చేశారు ఆలయ సీఈవో మదుసూదన్ రెడ్డి. నకిలి దర్శనం టికెట్లు అమ్ముతున్న కేటుగాళ్లపై కేసు నమోదు చేసిన పోలీసులు… కేసు విచారణ చేస్తున్నారు.
శ్రీశైలంలో నకిలి దర్శనం టికెట్ల స్కాంలో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు శ్రీశైలం వన్ టౌన్ పోలీసులు. ఇక శ్రీశైలంలో నకిలి దర్శనం టికెట్ల స్కాం పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.