దారుణం.. పదోతరగతి విద్యార్థిపై పెట్రోల్‌ పోసి నిప్పు

-

ఏపీలో రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు నేరాలకు అడ్డుకట్ట వేయలేక పోతున్నారు. ప్రతిరోజు ఎక్కడో చోట హత్యలు, దాడులు, ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. మొన్న ఏలూరులో మొన్న ఏలూరులో విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న వివాహితపై గుర్తుతెలియని వ్యక్తులు యాసిడ్​ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరవకముందే తాజాగా బాపట్ల జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో అభం శుభం తెలియని పదో తరగతి విద్యార్థి బలయ్యాడు.

బాపట్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.అమర్నాథ్‌ అనే పదో తరగతి విద్యార్థిపై కొంత మంది దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. చెరుకుపల్లి మండలం రాజోలులో ఈ ఘటన జరిగింది. ఉదయం ట్యూషన్‌కు వెళ్లి తిరికి ఇంటికి వెళ్తుండగా దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన బాలుడిని గుంటూరు జీజీహెచ్‌కు తరలిస్తుండగా మార్గంమధ్యలో చనిపోయాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version