జబర్దస్ షోతో యాంకర్‌గా అడుగుపెట్టి.. ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది అనసూయ. ఆ తర్వాత నెమ్మదిగా సినిమా అవకాశాలు దక్కించుకుంది. అలా ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఓవైపు షూటింగులతో బిజీగా ఉన్నా.. ఫ్యామిలీకి మాత్రం పక్కాగా తను టైం కేటాయిస్తుంది. ఇక సమ్మర్ వెకేషన్లో జాలీగా ఎంజాయ్ చేస్తోంది అనసూయ. తాజాగా తన భర్త సుశాంత్ భరద్వాజ్‌తో కలిసి ఫామ్‌హౌజ్‌కు వెళ్లింది. అక్కడి తోటల్లో తిరుగుతూ సందడి చేసింది.
తాజాగా అనసూయ తన భర్తతో కలిసి వాళ్ల మామిడి తోటలో సందడి చేసింది. మామిడి కాయలు తెంపుతూ కనిపించింది. ఈ సందర్భంగా భర్తతో రొమాంటిక్‌గా ఫోజులిచ్చింది. తన భర్త ఎత్తుకోగా మామిడి కాయలు కోస్తూ ఆకట్టుకుంది. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు మిర్చిలో ప్రభాస్ – అనుష్క సీన్‌ను రిపీట్ చేశారుగా అని అంటున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరికొందరు మామిడి కాయలు తింటున్న అనసూయను.. చూసి మళ్లీ ప్రెగ్నెంట్ ఏమోనని అంటున్నారు.