వింత దొంగ.. చోరీ చేసిన ఇంట్లోనే నిద్రపోయాడు….!

-

వింత దొంగ.. చోరీ చేసిన ఇంట్లోనే నిద్రపోయాడు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో చోరీ చేసిన ఇంట్లోనే నిద్రపోయాడు దొంగ. వ్యవసాయ పనుల నిమిత్తం సొంతూరు అలజంగికి సీర శ్రీనివాసరావు అనే వ్యక్తి వెళ్ళాడు.

robery sleep
robery sleep

ఎవరూ లేరని గమనించి.. శ్రీనివాసరావు ఇంటి తాళం పగులగొట్టి చొరబడ్డాడు దొంగ. మూడు రోజుల నుంచి ఇంట్లోని వెండి, ఇత్తడి సామాన్లు అమ్ముకుంటూ మద్యం తాగి ఆ ఇంట్లోనే నిద్రపోతున్నాడు దొంగ. స్థానికులు గమనించి సమాచారం అందించడంతో దొంగను పట్టుకున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news