బంగాళాఖాతంలో బలపడుతున్న వాయుగుండం.. ఉత్తరాంధ్ర పై ప్ర‌భావం

-

ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాలపై అరేబియా మహాసముద్రంలో తేజ్‌ తుఫాన్ ప్రభావం చూపుతోంది. ఇదే క్రమంలో బంగాళాఖాతంలో ఏర్పడిన మరో తుఫాను దూసుకొస్తున్న‌ద‌ని వాతావ‌ర‌ణ శాఖ రిపోర్టులు పేర్కొంటున్నాయి. బంగాళాఖాతంలో హమూన్‌ తుఫాన్‌ ఏర్పడినట్టు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. దీని కార‌ణంగా ఉత్తరాంధ్రపై ప్ర‌భావం ఉంటుంద‌ని తెలిపింది. నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతంలో అక్టోబర్ 21న ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ అమరావతి యూనిట్ తెలిపింది.

ఇది వాయువ్య దిశగా కదులుతుందని, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 23 లేదా 24 తేదీల్లో అల్పపీడనంగా మారుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ప్ర‌స్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలపడుతున్న తీవ్ర వాయుగుండం తుఫానుగా మారుతోంద‌ని తెలిపింది. పారాదీప్‌కు దక్షిణంగా 430 కిమీ దూరంలో కేంద్రీకృతమైంద‌నీ, నేడు హమున్ తుఫాన్‌గా మారనున్న తీవ్ర వాయుగుండం నేప‌థ్యంలో వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. తుఫాన్‌ ప్రభావంతో ఉత్తరాంధ్రలో మేఘావృతమైన వాతావ‌ర‌ణం ఉంటుంద‌నీ, శ్రీకాకుళంతో పాటు ప‌లు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశముంద‌ని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news