బాబును న‌మ్మి ఫ్యూచ‌ర్ బ‌లి చేసుకున్న ఆ నేత‌… ముందు నుయ్యి.. వెన‌క గొయ్యి

-

ఆయ‌న రాజ‌కీయాల్లో ఓ సీనియ‌ర్ నాయ‌కుడు… గ‌తంలో దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్సార్‌కు అభిమానిగా ఉండేవారు. ఆ త‌ర్వాత ఆయ‌న ద‌య‌తో అన‌కాప‌ల్లి ఎంపీ అయ్యారు. ఆ త‌ర్వాత జ‌గ‌న్‌కు చేరువ అయిన‌ట్టు క‌నిపించినా గ‌త ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబును న‌మ్మి త‌న రాజ‌కీయ జీవితాన్ని కొలాప్స్ చేసుకున్నారు. ఆయ‌నే ఎవ‌రో కాదు మాజీ ఎంపీ, ప్ర‌స్తుత టీడీపీ నేత స‌బ్బం హ‌రి. వైఎస్ ద‌య‌తో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన ఆయ‌న వైజాగ్ న‌గ‌ర మేయ‌ర్‌గా ప‌నిచేశారు. మంచి వాగ్దాటి ఉండ‌డంతో వైఎస్ ఆయ‌న్ను మ‌రింత‌గా ప్రోత్స‌హించారు. 2009 ఎన్నిక‌ల్లో వైఎస్ స‌బ్బం హ‌రిని అన‌కాప‌ల్లి నుంచి ఎంపీగా పోటీ చేయించారు. ఆ ట్రైయాంగిల్ ఫైట్‌లో హ‌రి ఎంపీగా గెలిచి లోక్‌స‌భ‌లో అడుగు పెట్టారు.

వైఎస్ మ‌ర‌ణాంత‌రం స‌బ్బం హ‌రి జ‌గ‌న్‌కు అనుకూలంగా మీడియాలో త‌న బ‌ల‌మైన వాయిస్ వినిపించేవారు. ఆ టైంలో ఆయ‌న అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోగా.. ఆ పార్టీ నేత‌లు సైతం ఆయ‌న్ను తీవ్రంగా విమ‌ర్శించారు. అయితే ఇలాంటి విమ‌ర్శ‌ల‌కు ఏ మాత్రం లొంగ‌ని ఆయ‌న 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి సీటు ఆఫ‌ర్ వ‌చ్చినా పోటీ చేయ‌కుండా దూరంగా ఉన్నారు. ఇక గ‌త ఐదేళ్ల పాటు అటూ ఇటూ ఊగిస‌లాడి చివ‌ర‌కు చంద్ర‌బాబు చెంత చేరారు. భీమిలిలో ప్ర‌స్తుత మంత్రి అవంతి శ్రీనివాస్‌పై పోటీ చేసి ఓడిపోయారు.

ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు స‌బ్బం త‌న‌కు ప‌ట్టున్న అన‌కాప‌ల్లి ఎంపీ సీటు ఇవ్వాల‌ని కోరినా కావాల‌నే భీమిలిలో అవంతిపై పోటీ చేయించారు. అయితే అప్ప‌టికే అక్క‌డ ఓట‌మి భ‌యంతో ఉన్న గంటా విశాఖ నార్త్‌కు మారిపోయారు. విచిత్రం ఏంటంటే గంటా నార్త్‌లో గెలిస్తే భీమిలిలో అవంతి ఓడిపోయారు. త‌న‌కు భీమిలి సూట్ కాద‌ని తెలుసుకున్న స‌బ్బం ఇప్పుడు మ‌ళ్లీ అనకాప‌ల్లి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌గ్గాలు ఇవ్వాల‌ని చంద్ర‌బాబును కోరుతున్నార‌ట‌. చంద్ర‌బాబు మాత్రం చూద్దాంలే అన్న‌ట్టుగా ఉన్నార‌ట‌. ఏదేమైనా అదే స‌బ్బం గ‌త ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీలోకి వ‌చ్చి ఉంటే ఖ‌చ్చితంగా గెలిచేవారు. బాబును న‌మ్మ‌డంతో ఆయ‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తు.. ముందు నుయ్యి.. వెన‌క గొయ్యి చందంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version