ఏపీలో ముంపు గ్రామాల వరద బాధిత కుటుంబాలకు నేటి నుంచి సబ్సిడీ మీద కూరగాయాలు అందజేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. నిత్యావసరాల కిట్‌తో పాటు రాయితీపై కూరగాయాలు అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. రూ.2, రూ.5, రూ.10 ఈ మూడు ధరలకే కూరగాయాలు అందుబాటులో ఉంచుతామన్నారు. వరద బాధితులు అందరికీ కూరగాయాలు సరఫరా చేస్తామన్నారు. ఆకు కూరలను రూ.2కే ఇస్తామని ప్రకటించారు.
రూ.10, రూ.15, రూ.20 ధర ఉన్న కూరగాయాలను రూ.5కే, రూ.25 నుంచి 30 ధరలున్న వాటిని సబ్సిడీపై రూ.10కే అందుబాటులోకి తెస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇదిలాఉండగా, విజయవాడలోని ముంపు గ్రామాల ప్రజలు తమకు ఆర్థికసాయం ప్రకటించాలని కోరుతున్నారు. కాగా, వరదలో కొట్టుకుపోయిన వాహనాలకు ప్రభుత్వమే ఇన్సురెన్స్ చెల్లిస్తుందని ఏపీ ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ఏపీలో మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ హెచ్చరికలు జారీచేసింది.