విజయవాడ వరద బాధితులకు 25 కిలోల బియ్యం, నిత్యవసర వస్తువులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది చంద్రబాబు నాయుడు సర్కార్. బెజవాడలో వరద ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ ముమ్మర ఏర్పాట్లు చేసింది. 25 కిలోల బియ్యం, 2 కిలోల ఉల్లిపాయలు, బంగాళదుంపలు, కిలో పామాయిల్, కిలో పంచదార, కిలో కందిపప్పు ఇవ్వనుంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.
తొలి విడతగా 50 వేల మందికి ఇవ్వటానికి కిట్లను సిద్దం చేస్తోంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అంటే మొత్తం 2.50 లక్షల మందికిపైగా ఇవ్వటానికి సిద్ధమవుతోంది కిట్లు. వరద ముంపు ప్రాంతాల్లో ఎక్కువ మంది చిక్కుకోవటంతో పనిచేసే వారు దొరక్క ప్యాకింగ్ కు కొంత ఇబ్బంది వస్తోందని చెబుతున్నారు అధికారులు. రేపటి నుంచి ముంపు ప్రాంతాల్లో కిట్లను ఇవ్వనున్న ప్రభుత్వం..ప్రస్తుతం 25 కిలోల బియ్యం, నిత్యవసర వస్తువులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.