Srihari Kota: విజయవంతంగా నింగిలోకి ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్

-

విజయవంతంగా నింగిలోకి ప్రైవేట్ రాకెట్ అగ్నిబాణ్ దూసుకెళ్లింది. ఎట్టకేలకు శ్రీహరికోటలో మొదటి ప్రైవేట్ లాంచ్ పాడ్ నుంచి నింగికెగిరి చరిత్ర సృష్టించింది అగ్నిబాన్ ప్రైవేటు రాకెట్. ఈ రోజు 7.15 గంటలకు శ్రీహరికోటలోని ప్రైవేట్ లాంచ్ పాడ్ నుంచి విజయవంతంగా ప్రయోగం నిలిచింది. చివరి నిముషంలో సాంకేతిక కారణాలతో నాలుగు సార్లు ప్రయోగం వాయిదా పడిన సంగతి తెలిసిందే.

Successfully landed private rocket Agniban

5 వ ప్రయత్నంలో విజయవంతంగా ప్రయోగించింది చెన్నైకి చెందిన అగ్నికుల్ కాస్మోస్ స్టార్టప్ సంస్థ. భూమికి 700 కిలోమీటర్లు ఎత్తు లోని లో ఎర్త్ ఆర్బిట్ లో 300 కిలోల లోపు ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు చేపట్టింది ఈ ప్రయోగం. భారత అంతరిక్ష రంగాన్ని ప్రైవేటీకరణ చేసే దిశగా సాగుతున్న ప్రయత్నాలలో కీలకంగా మారింది ప్రయోగం. ఈ ప్రయోగ ప్రక్రియను పర్యవేక్షించారు ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version