ఏపీ విద్యార్థులకు అలర్ట్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో స్కూళ్లకు ఈ నెల 29 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. చివరి రోజు విద్యార్థులు, తల్లిదండ్రులతో మీటింగ్ నిర్వహించి రిపోర్టు కార్డులను అందించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది.
తల్లిదండ్రులు తప్పనిసరిగా ఈ సమావేశానికి హాజరయ్యేలా అధికారులు, స్కూళ్ల ప్రధాన ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించింది. జూన్ 12 నుంచి ఏపీలో తిరిగి పాఠశాలలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఇవాళ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ విషయాన్ని ఏపీ విద్యాశాఖ అధికారులు తెలియచేశారు. విజయవాడలో ఇవాళ సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను ఆన్లైన్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ పరీక్షకు మొత్తం విద్యార్థులు 4 .84 లక్షల మొదటి సంవత్సరం మరియు రెండవ సంవత్సరం 5 .19 లక్షల మంది హాజరు అయ్యారు.