ఏపీ సర్కార్‌కు షాక్.. అమరావతిపై విచారణ మార్చి 28నే అని తేల్చిచెప్పిన సుప్రీం

-

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల అంశంపై మార్చి 28నే విచారణ చేపడతామని కోర్టు తేల్చి చెప్పింది. విచారణ త్వరగా పూర్తిచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు మరోసారి చేసిన విజ్ఞప్తిని.. జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ ధర్మాసనం తోసిపుచ్చింది. ఇది వరకు పేర్కొన్నట్లుగా మార్చి 28నే విచారణ చేపడతామని తేల్చి చెప్పింది. 28వ తేదీ ఒక్కటే సరిపోదని.. మార్చి 29, 30న కూడా విచారించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు కోరారు.

అమరావతి రాజధాని కేసు చాలా పెద్దదని.. కేసు విచారణ చేపడితే సార్థకత ఉండాలని ఈ సందర్భంగా జస్టిస్‌ కేఎం జోసెఫ్‌ వ్యాఖ్యానించారు. దీనిలో రాజ్యాంగపరమైన అంశాలు చాలా ఇమిడి ఉన్నాయని అన్నారు. అంతకుమించి ఈ కేసులో ఇంకేమీ వ్యాఖ్యానించలేనని చెప్పారు. తమ విజ్ఞప్తిని సీజేఐ ముందు ప్రత్యేకంగా ప్రస్తావించేందుకు అనుమతివ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరగా ధర్మాసనం నిరాకరించింది.

Read more RELATED
Recommended to you

Latest news