3 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయి..అందుకే సిలిండర్‌ ధరలు పెంచారు – హరీష్‌ రావు

-

3 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయి..అందుకే సిలిండర్‌ ధరలు పెంచారని ఫైర్‌ అయ్యారు మంత్రి హరీష్‌ రావు. గ్యాస్ ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తూ మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ లో నిర్వహించిన నిరసన ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా హరీష్‌ రావు మాట్లాడుతూ, పేద ప్రజల మీద కేంద్ర ప్రభుత్వం పెద్ద గ్యాస్ బండ వేసిందని.. అడ్డగోలుగా గ్యాస్ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరిచిందని ఫైర్‌ అయ్యారు.

తరుచూ సిలిండర్ ధర పెంచుతూ వంటింట్లో మంట రేపుతున్నదని.. డొమెస్టిక్ సిలిండర్ పై రూ. 50 చొప్పున, కమర్షియల్ సిలిండర్ పై రూ. 350 చొప్పున పెంచడం దారుణమైన చర్య అన్నారు. రెండు లక్షల 14 వేల కోట్ల రూపాయలను యూపీఏ ప్రభుత్వం హయాంలో సబ్సిడీ కింద ఇచ్చారని.. బీజేపీ ప్రభుత్వం 40,000 కోట్ల సబ్సిడీ ఇస్తుందంటే ఎంత తగ్గించిందనేది అర్థమవుతుందని నిప్పులు చెరిగారు. 2014 లో బిజెపి అధికారం లోకి వచ్చినప్పుడు ఒక్కో సిలిండర్ మీద 350 సబ్సిడీ ఉండే, క్రమంగా తగ్గిస్తూ ఇప్పుడు సున్నా చేశారని.. దేశంలో వాణిజ్య సిలిండర్‌ ధరలు పెరగడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి అన్నారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Latest news