సుప్రీంకోర్టులో నేడు ఓటుకు నోటు కేసు విచారణ

-

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు రానుందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. 2015లో ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడు అడ్డంగా దొరికారని అన్నారు.  చంద్రబాబు నాయుడు 2017లో సుప్రీం కోర్టు లో కేసు వేశారని గుర్తుచేశారు. ఏడేళ్లయినా విచారణ జరగకపోతే ఇక సామాన్యులకు ఏమి న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు.

ఓటుకు నోటు కేసు లో తెలంగాణ ఏసీబీ ఈ కేసును సరిగా విచారణ చేయడం లేదు. అందుకే ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేయాలిరు. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చాలి. ఈ కేసుకు సంబంధించి మత్తయ్య, సెబాస్టియన్‌ కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారి. ఇన్ని కేసులున్నా చంద్రబాబు  లేకుండా బుకాయిస్తున్నారు. ఏడేళ్లయినా చిన్న కారణాలతో కేసును సాగదీస్తున్నారు. అని ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు.

రెడ్‌ హ్యాండెడ్‌గా ఆడియో, వీడియోలో దొరికినా దొరలా తిరుగుతున్నారని, నోట్ల కట్టలతో దొరికిన వ్యక్తి తెలంగాణకు సీఎం అయ్యారని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. నోట్లు పంపిన వ్యక్తి సీఎం కావాలని తిరుగుతున్నారని ఆరోపించారు. ఓటుకు నోటుకు సంబంధించి అయిదు కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version