మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ పిటిషన్ కేసులో ఏపీ పోలీసులకు సుప్రీం నోటీసులు జారీ అయ్యాయి. కేసు విచారణ జరిపిన జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ప్రశాంత్ కిషోర్ మిశ్రా ధర్మాసనం…ఏపీ పోలీసులకు నోటీసులు జారీ చేశారు. మాజీ ఎంపీ సురేష్ తరపున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్. మాజీ ఎంపీ సురేష్ పై రాజకీయ కక్షతో కేసు పెట్టారని… ఘటన జరిగిన ప్రాంతంలో సురేష్ లేనే లేరన్నారు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.
2020లో రాయి తగిలి మృతిచెందిన మరియమ్మ కేసులో 78వ నిందితుడుగా సురేష్ ను చేర్చి అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. అయితే… టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దళితుడైన మాజీ ఎంపీ సురేష్ ను ఈ అక్రమంగా ఇరికించారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వివరించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా సురేష్ పై కేసులు బనాయిస్తోందని టీడీపీ ప్రభుత్వం పై ఫిర్యాదు చేశారు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్. ఇక ఈ కేసు పై కేసు బనాయించి దలితుడయిన మాజీ ఎంపీ సురేష్ ని వేధిస్తున్నారన్నారు. ఈ తరునంలోనే.. ఏపీ పోలీసులకు సుప్రీం నోటీసులు జారీ అయ్యాయి.