ఆసీస్‌ కు టీడీపీ తమ్ముళ్లు సపోర్టు అంటూ ట్వీట్లు ?

-

ఆసీస్‌ కు టీడీపీ తమ్ముళ్లు సపోర్టు అంటూ ట్వీట్లు వైరల్‌ అవుతున్నాయి. అయితే.. దీనిపై రఘురామకృష్ణ రాజు స్పందించారు. క్రికెట్లోనూ వైకాపా సానుభూతిపరులు రాజకీయాలను జోప్పించడం అసహ్యంగా ఉందని రఘురామకృష్ణ రాజు అన్నారు. జగన్ మోహన్ రెడ్డి గారికి బ్లూ రంగు జెర్సీ వేసి, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఎల్లో రంగు జెర్సీని వేసి జగన్ ట్రెండ్స్ అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఉదయం నుంచి సాయంత్రం వరకు హడావిడి చేశారని, ఇండియా గెలుస్తుందని అందరూ భావించారని, అయితే ఒత్తిడిని తట్టుకోవడం మన ఆటగాళ్లకు కష్టమయ్యిందని అన్నారు.

దేశ ప్రధాని గారితో పాటు, ఇతర సెలబ్రిటీల ముందు ఒత్తిడిని తట్టుకొని విజయం సాధించడంలో విఫలమయ్యారని… అయినా క్రీడల్లో గెలుపు ఓటములు సహజమేనని అన్నారు. క్రీడల్లో కూడా రాజకీయాన్ని జోప్పించడం కేవలం వైకాపా సానుభూతిపరులకే చెల్లిందని, చివరకు విజయం పసుపు రంగుకే దక్కిందని మూసుకొని కూర్చుంటారా?.. ఆబ్బెబ్బే తూచ్, అది క్రికెట్… ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గారికి వ్యూహాలు వేరే ఉన్నాయని అంటారా అంటూ అపహాస్యం చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్క్రీన్ లకు జగన్ మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏమిటని రఘురామకృష్ణ రాజు గారు ప్రశ్నించారు. క్రికెట్ మ్యాచ్ మధ్యలో జగన్ మోహన్ రెడ్డి గారు క్రికెట్ బ్యాట్ పట్టిన చిత్రాలను ప్రదర్శించడం ఎందుకని నిలదీశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version