కడపలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. కడప అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్థి మాధవీరెడ్డి 655 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వెనకబడ్డారు. పులివెందులలో సీఎం జగన్ లీడింగులో ఉన్నారు. అటు కడప ఎంపీ స్థానంలో వైసీపీ అభ్యర్థి అవినాశ్ రెడ్డి సైతం వెనుకబడ్డారు. కూటమి అభ్యర్థి భూపేశ్ ప్రస్తుతం ఆధిక్యత కనబరుస్తున్నారు. జగన్ సొంత జిల్లాలో ఇద్దరు వైసీపీ క్యాండిడేట్లు వెనకబడటం వైసీపీకి ఇబ్బందికర పరిణామమే.
కాగా, 105 స్థానాల్లో కూటమి ఆధిక్యంలో ఉంది. మ్యాజిక్ ఫిగర్‌ను దాటింది ఎన్డీఏ కూటమి. స్పష్టమైన ఆధిక్యంలో టీడీపీ ఉంది. ఇక హిందూపురం అసెంబ్లీ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ లీడింగులో ఉన్నారు. అక్కడ వైసీపీ నుంచి దీపిక బరిలో ఉన్నారు. అయితే హిందూపురం ఎంపీ సెగ్మెంట్‌లో వైసీపీ అభ్యర్థి శాంతమ్మ ఆధిక్యంలో ఉన్నారు. అక్కడ టీడీపీ నుంచి పార్థసారథి పోటీ చేస్తున్నారు. అలాగే డోన్‌లో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వెనకంజలో ఉన్నారు. అక్కడ టీడీపీ నుంచి కోట్ల సూర్యప్రకాశ్ బరిలో ఉన్నారు.