ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనం ఛాయలు కనిపిస్తుండటంతో మదుపరులు తమ పెట్టుబడులకు రక్షణ ఉండేలా చూసుకుంటున్నట్లు ఆర్థిక రంగ విశ్లేషకులు చెబుతున్నారు. అందుకే షేర్లు, ఈక్విటీల జోలికి పోకుండా ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు బంగారం మీదే అధికంగా పెట్టుబడులు పెడుతున్నట్లు సమాచారం. దీంతో రోజురోజుకూ బంగారం ధరలు ఆకాశన్నంటుతున్నాయి.
తాజాగా నిన్నటి ధరలతో పోలిస్తే.. గురువారం ఉదయం భారీగా ధరలు పెరిగాయి. 22 క్యారెట్స్ బంగారం ధర రూ. 550కు పెరిగి రూ. 81,200గా ఉండగా..ఇక 24 క్యారెట్ల బంగారం ధర రూ.600 పెరిగి రూ.88,580 వద్దకు చేరింది. కిలో వెండి ధర రూ.1,10,000గా ఉండగా.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర-రూ.81,200, 24 క్యారెట్ల బంగారం ధర-రూ.88,580 ఉండగా.. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర-రూ.81,200, 24 క్యారెట్ల బంగారం ధర-రూ.88,580గా ఉన్నది.