వివేకాలాగే నన్నూ చంపుతారేమో.. చంద్రబాబు సంచలన కామెంట్స్

-

N.S.G భద్రత లేకపోతే తనను కూడా వైఎస్ వివేకాను చంపినట్టే చంపేవారేమోనని.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. డబ్బులు తప్ప మనుషుల విలువ తెలియని మానవ మృగాల్లా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని తీవ్రంగా ఫైర్ అయ్యారు. చిత్తూరు జిల్లాలో వనరులన్నింటినీ దోచేస్తున్న మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం.. ప్రశ్నిస్తున్న తనపై వైసీపీ కార్యకర్తలపై దాడి చేయించిస్తోందని ధ్వజమెత్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి పరిధిలోని అంగళ్లు, పూతలపట్టు ప్రాంతంలో వైసీపీ విధ్వంసం తర్వాత.. పూతలపట్టులో నిర్వహించిన రోడ్‌షో, బహిరంగ సభల్లో తెలుగుదేశం అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి, చిత్తూరు ఎస్పీ రిషాంత్‌రెడ్డి తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

పుంగనూరు ప్రాంతం ‘పెద్దిరెడ్డి తాత జాగీరా’ అని చంద్రబాబు ప్రశ్నించారు. దాడులు చేయించడమే కాకుండా కుప్పంలో ఏదో చేస్తానని ప్రగల్బాలు పలుకుతున్న పెద్దిరెడ్డి.. వచ్చే ఎన్నికల్లో పుంగనూరులో ఎలా గెలుస్తారో చూస్తానని సవాల్‌ చేశారు. ప్రతిపక్ష నేత పర్యటనను అడ్డుకునేందుకు వచ్చిన వైసీపీ నాయకులను నియంత్రించకుండా, తెలుగుదేశం వారిపై లాఠీఛార్జి చేయించడం ఏమిటంటూ.. ఎస్పీ రిషాంత్‌ రెడ్డి తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version