BREAKING : తెలంగాణ ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై కీలక ప్రకటన చేశారు. టీఎస్ఆర్టీసీ విలీన బిల్లు పై రగడ కొనసాగుతోంది. బిల్లుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నుంచి సరైన సమాచారం రాలేదని తాజాగా రాజ్ భవన్ నుంచి ఓ ప్రకటన వచ్చింది. టీఎస్ఆర్టీసీ విలీన బిల్లు పై క్లారిటీ ఇచ్చింది రాజ్ భవన్.
అసెంబ్లీలో టీఎస్ఆర్టీసీ బిల్లును ప్రవేశ పెట్టేందుకు గవర్నర్ అనుమతి కోరింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే… టీఎస్ఆర్టీసీ బిల్లుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరామని గవర్నర్ తమిళిసై కీలక ప్రకటన చేశారు. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వివరణ కోరామని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం సరైన వివరణ వస్తే బిల్లుపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు తమిళిసై.
కాగా, టీఎస్ఆర్టీసీ బిల్లును రాజ్ భవన్ పెండింగ్లో ఉంచినందున.. శనివారం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2 గంటలు బంద్ చేసేందుకు ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 6 నుంచి 8 గంటల వరకు ఆర్టీసీ సేవలు నిలిపివేయాలని నిర్ణయించాయి. గవర్నర్ బిల్లును ఆమోదించాలని ఆర్టీసీ టీఎంయూ నిరసన చేపట్టనున్నారు.