అధికారంలోకి వచ్చాక టీడీపీ పార్టీ నేతలు బరి తెగిస్తున్నారు. తాజాగా గుడివాడ వైసిపి కార్యాలయ భవనంపై టిడిపి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శరత్ థియేటర్లో 8 ఏళ్ల క్రితం వైసీపీ కార్యాలయం తాత్కాలికంగా ఏర్పాటు చేశారు కొడాలి నాని. థియేటర్ ఖాళీ చేయాలని గతంలో పలుమార్లు విజ్ఞప్తి చేశారు భాగస్వామ్యులు.
భాగస్వామ్యులపై కొడాలి నాని బెదిరింపులకు దిగినట్టు ఆరోపణలు వస్తున్నాయి. థియేటర్ భాగస్వామి అయిన గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ యాలవర్తి యువసేన…. చంద్రన్న అసెంబ్లీలోకి… పునరాగమనం కానున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం పేరుతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారట. దీంతో ఇప్పుడు ఈ టాపిక్ వివాదంగా మారింది.
ఇక అటు ఏపీ 16వ శాసనసభ కొలువుదీరింది. ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత తొలిసారి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ మెట్లకు ప్రణమిల్లి సీఎం చంద్రబాబు సభ లోపలికి వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో గౌరవ సభకు చంద్రబాబు హాజరయ్యారు. రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీకి ఆయన వచ్చారు. అంతకుముందు సీఎం చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు వెంకటపాలెం చేరుకుని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.