ఏపీ వ్యాప్తంగా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ తరుణంలోనే… రూ.100 చెల్లించి తొలి సభ్యత్వం తీసుకున్నారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. రూ.100కే టీడీపీ సభ్యత్వం.. రూ.లక్ష కడితే శాశ్వత సభ్యత్వం ఇస్తామని ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఓ రాజకీయ విశ్వవిద్యాలయం అన్నారు. నేటితరం చాలా మంది తెలుగు రాజకీయ నాయకుల మూలాలు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ పనిపోయిందన్న వాళ్ల పనైపోయింది కానీ పార్టీ శాశ్వతంగా ఉంటుందని పేర్కొన్నారు.
తెలుగుదేశం పార్టీ వారసులుగా భవిష్యత్తు తరాలకు ఆ ఫలాలు అందించే బాధ్యత మనదని పేర్కొన్నారు. తెలుగుదేశం ముందు తెలుగుదేశం తర్వాత అన్నట్లుగా తెలుగుజాతికి గుర్తింపు వచ్చిందని గుర్తు చేశారు.కార్యకర్తలకు ఎప్పుడూ పెద్దపీఠ వేస్తూ వారి మనోభావాలు గౌరవించే పార్టీ తెలుగుదేశం అన్నారు. యువతను ప్రోత్సహిస్తూ, పదవులు, అధికారాలు సామాన్యులకు, చదువుకున్న వారికి, అన్నివర్గాలకు అందించిన పార్టీ అని వెల్లడించారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు దేశంలోనే తొలిసారి ప్రమాద భీమా ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం అని వెల్లడించారు. ఈ వి నూత్న ఆలోచనకు లోకేష్ శ్రీకారం చుట్టి ఎంతో పటిష్టం చేస్తూ వచ్చారన్నారు. శాశ్వత సభ్యత్వం తీసుకునేందుకు ఇచ్చే రూ.లక్ష కూడా కార్యకర్తల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తామని తెలిపారు.