TDP పార్టీ ఓ రాజకీయ విశ్వవిద్యాలయం- సీఎం చంద్రబాబు

-

TDP పార్టీ ఓ రాజకీయ విశ్వవిద్యాలయం అన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ వ్యాప్తంగా టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ తరుణంలోనే… రూ.100 చెల్లించి తొలి సభ్యత్వం తీసుకున్నారు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. రూ.100కే టీడీపీ సభ్యత్వం.. రూ.లక్ష కడితే శాశ్వత సభ్యత్వం ఇస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… నేటితరం చాలా మంది తెలుగు రాజకీయ నాయకుల మూలాలు కూడా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాయని తెలిపారు. తెలుగుదేశం పార్టీ పనిపోయిందన్న వాళ్ల పనైపోయింది కానీ పార్టీ శాశ్వతంగా ఉంటుందని పేర్కొన్నారు.

CPI State Secretary K Ramakrishna’s letter to CM Chandrababu Naidu

తెలుగుదేశం పార్టీ వారసులుగా భవిష్యత్తు తరాలకు ఆ ఫలాలు అందించే బాధ్యత మనదని పేర్కొన్నారు. తెలుగుదేశం ముందు తెలుగుదేశం తర్వాత అన్నట్లుగా తెలుగుజాతికి గుర్తింపు వచ్చిందని గుర్తు చేశారు.కార్యకర్తలకు ఎప్పుడూ పెద్దపీఠ వేస్తూ వారి మనోభావాలు గౌరవించే పార్టీ తెలుగుదేశం అన్నారు. యువతను ప్రోత్సహిస్తూ, పదవులు, అధికారాలు సామాన్యులకు, చదువుకున్న వారికి, అన్నివర్గాలకు అందించిన పార్టీ అని వెల్లడించారు. సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు దేశంలోనే తొలిసారి ప్రమాద భీమా ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం అని వెల్లడించారు. ఈ వినూత్న ఆలోచనకు లోకేష్ శ్రీకారం చుట్టి ఎంతో పటిష్టం చేస్తూ వచ్చారన్నారు. శాశ్వత సభ్యత్వం తీసుకునేందుకు ఇచ్చే రూ.లక్ష కూడా కార్యకర్తల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తామని తెలిపారు. చనిపోయిన కార్యకర్తల పిల్లలు చాలామందికి ఎలిమెంట్రీ స్కూల్ నుంచి పీజీ వరకు చదవిస్తున్నట్లు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version