ఏపీ అసెంబ్లీలో నోరు జారిన టీడీపీ ఎమ్మెల్యే..!

-

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో శనివారం ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఎన్నుకున్న తర్వాత సభ్యులందరూ ఆయన గురించి మాట్లాడారు. ఈ సందర్బంగా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి ఇంగ్లీషులో ప్రసంగించారు.

ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం గొప్ప విషయం అన్నారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో తాను ఎమ్మెల్యేగా కొనసాగడం గర్వకారణం అన్నారు. టీడీపీ హయాంలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఈ క్రమంలో లేట్ సీఎం ఎన్టీఆర్ పేరు ప్రస్తావించబోయిన ఎమ్మెల్యే సింధూర రెడ్డి లేట్ చంద్రబాబు అని కాస్త తడబడ్డారు. వెంటనే సారి చెప్పారు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ కావడం విశేషం. అసెంబ్లీలో దాదాపు మంత్రులు, ఎమ్మెల్యేలు  అందరూ కూడా  మాతృ భాషలో మాట్లాడితే పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూర రెడ్డి మాత్రం అసెంబ్లీలో ఇంగ్లీషు భాషలో మాట్లాడటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version