అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వలేం! : హైకోర్టు

-

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు వినలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇవాళ వాదనలు విని ఉత్తర్వులు ఇవ్వడం వీలు కాదని న్యాయమూర్తి జస్టిస్‌ సురేంద్ర తెలిపారు.  రేపటి నుంచి హైకోర్టుకు వేసవి సెలవులు ఉన్నందున విచారణను జూన్‌ 5కు వాయిదా వేస్తున్నట్టు చెప్పారు. సీబీఐ అరెస్టు చేసే అవకాశముందని, వేసవి సెలవుల కోర్టులో విచారణ జరపాలని అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్‌రెడ్డి హైకోర్టు జడ్జికి నివేదించారు. అత్యవసరం అనుకుంటే ప్రధాన న్యాయమూర్తిని కోరాలని సూచించారు.

సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా రెండు వారాలైనా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్‌రెడ్డి న్యాయవాది విన్నవించగా.. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. వేసవి సెలవుల ప్రత్యేక కోర్టులో విచారణకు అనుమతించాలని హైకోర్టు సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ను అవినాష్ తరఫు న్యాయవాది కోరగా.. హడావుడిగా నిర్ణయం తీసుకోలేమన్నారు. విచారణకు అనుమతిపై వేసవి సెలవుల ప్రత్యేక కోర్టునే కోరాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version