మూడ్రోజుల పాటు వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన.. షెడ్యూల్​ ఇదే

-

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు భరోసా కల్పించనున్నారు. ఈ సందర్భంగా రైతులను కలిసి వారి గోస వినడానికి.. వారికి భరోసానివ్వడానికి ఆమె మూడ్రోజుల పాటు జిల్లాల్లో పర్యటించనున్నారు. రేపట్నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని జనగామ, డోర్నకల్‌.. 30వ తేదీన ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వైరా, ఇల్లందు, మధిర.. మే 1వ తేదీన పాలేరులో పర్యటించనున్నారు. ఆ జిల్లాల్లో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి.. నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని షర్మిల భరోసా కల్పించనున్నారు.

జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేస్తూ.. షర్మిల రైతుల బాధలను తెలుసుకోనున్నారు. ఆ తర్వాత పాలేరులో నిర్వహించే పార్టీ కార్యక్రమంలో, మే డే వేడుకల్లో ఆమె పాల్గొననున్నారు. శనివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్​లోని లోటస్‌ పాండ్‌ నుంచి ఆమె ఉమ్మడి వరంగల్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. వడగండ్ల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు షర్మిల భరోసా కల్పించనున్నారు.

Video Player is loading.

Read more RELATED
Recommended to you

Exit mobile version