వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది – అచ్చెన్నాయుడు

-

వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు. కనీవినీ ఎరుగని రీతిలో రాజమండ్రి లో మహానాడును నిర్వహిస్తామన్నారు. మహానాడులో వచ్చే ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రధానాంశాలు చంద్రబాబు ప్రకటిస్తారని తెలిపారు. విజయదశమికి సమగ్రమైన,రాష్ట్ర భవిష్యత్తును మార్చే దిశగా మ్యానిఫెస్టో విడుదల చేస్తామన్నారు.

26వ తేదీన టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు రాజమండ్రి చేరుకుంటారని.. 26 సాయంత్రం పొలిట్ బ్యూరో సమావేశం చంద్రబాబు అధ్యక్షతన జరగనుందని వివరించారు. ఆ సమావేశంలో మహానాడులో ప్రవేశపెట్టే 15 తీర్మానాలు చర్చించి అమోదిస్తామన్నారు అచ్చెన్నాయుడు. 27న 15 వేలమంది ప్రతినిధుల సభలో చంద్రబాబు పాల్గొంటారని అన్నారు. 28న మహానాడుకు శరవేగంగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయని.. మహానాడు నుంచే ఎన్నికల శంఖారావం ఆరంభమవుతుందన్నారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version