కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పింఛన్ల పంపిణీలో జరుగుతున్న సమయంలో టిడిపి పార్టీలోని ఇరువర్గాలు ఘర్షణకు పాల్పడ్డాయి. పాత టీడీపీ నేతలు, వైసీపీ నుంచి టీడీపీ లో చేరిన నేతల మధ్య ఘర్షణ నెలకొంది. మంత్రాలయం జడ్పి స్కూల్ లో మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ విషయంలో టిడిపి పార్టీలోని ఇరువర్గాలు ఘర్షణకు పాల్పడ్డాయి.
టీడీపీ మండల అధ్యక్షుడు పన్నాగస్వామి వర్గీయులపై రాఘవేంద్ర రెడ్డి వర్గం దాడికి పాల్పడింది. ఈ సంఘటనలో సురేష్, రాజు అనే వ్యక్గులకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఇక ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు…పరిస్థితిని చక్కదిద్దారు. ఇక ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, మొన్నటి ఎన్నికల కంటే ముందు.. వైసీపీ పార్టీ నుంచి భారీ స్థాయిలో టీడీపీ పార్టీలో చేరారు నేతలు.