ఆంధ్రప్రదేశ్ లో మరో సారి పదో తరగతి పరీక్షల పేపర్ లీక్ కావడం కలకలం రేపుతుంది.క్వశ్చన్ పేపర్ లు వరుసగా బయటకు రావడం సంచలనంగా మారింది.శుక్రవారం ఇంగ్లీష్ పేపర్ లీక్ అయినట్లు ప్రచారం జరుగుతుంది.వాట్సప్ గ్రూపు ల్లో పదో తరగతి పరీక్షల పేపర్లు దర్శనమిచ్చాయి.కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పేపర్ లీకులు కలకలం రేపుతున్నాయి.నందికొట్కూరు గాంధీ మెమోరియల్ స్కూల్ నుంచి పేపర్ బయటకు వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.పాఠశాల అటెండరే పేపర్ లీక్ చేశాడు అని అనుమానిస్తున్నారు.
పేపర్ లీక్ పై కర్నూలు జిల్లా అధికారులు స్కూల్ సిబ్బంది, ఇన్విజిలేటర్లు, డిపార్ట్మెంటల్ చీఫ్ , సూపరిండెంట్ ను విచారిస్తున్నారు.పరీక్ష ముగిసిన గాంధీ మెమోరియల్ స్కూల్ నుంచి విద్యార్థులను బయటకి పంపడం లేదు అధికారులు.పేపర్ బయటకి వచ్చిన విషయాన్ని ఇంకా నిర్ధారించలేదు.పేపర్ బయటకి రావడం, మాల్ ప్రాక్టీస్ మాత్రమే..లీక్ కాదంటున్నారు అధికారులు.వదంతులు వ్యాప్తి చేసే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.