పొత్తులపై చర్చించేందుకు బీజేపీ నాయకత్వం ఆహ్వానించడంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తాజాగా ఢిల్లీకి రానున్నట్లుగా తెలిసిందని రఘురామకృష్ణ రాజు అన్నారు. వైకాపా ఆలోచనలకు అరిష్టం కలిగే విధంగా బీజేపీ నాయకత్వం, పొత్తుల కోసం చంద్రబాబు నాయుడు గారిని పిలిపించారని, ఢిల్లీలో బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు పొడవడం, జగన్ మోహన్ రెడ్డి గారి పొత్తికడుపులో కత్తిపోటు పుచ్చుకున్న భావన కలుగుతుందని అన్నారు.
కొన్ని బ్లూ చానల్స్, చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత కార్యక్రమం కోసమే హస్తినాకు వెళ్తున్నారని ప్రచారం చేస్తున్నాయని, బీజేపీ ఆహ్వానంపైనే ఆయన హస్తినాకు వస్తున్నారన్నది తనకు తెలిసిన నిజం అని అన్నారు. పొత్తును చెడగొట్టేందుకు ఆఖరి నిమిషం వరకు జగన్ మోహన్ రెడ్డి గారు తీవ్ర ప్రయత్నాలనే చేయనున్నారని, అయినా ఆ పప్పు లేని ఉడకవని తెలిసి, పొత్తులో భాగంగా నరసాపురం స్థానాన్ని తీసుకుంటే రఘురామకృష్ణ రాజు గారికి టికెట్ ఇవ్వద్దని వేడుకుంటున్నట్లు తెలిసిందన్నారు.