‘రాజీవ్ యువ వికాసం’ పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇందులో భాగంగా SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగ యువతకు రుణాలు మంజూరు చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5లక్షల మందికి రూ.6వేల కోట్ల రుణాలను 60 నుంచి 80 శాతం వరకు రాయితీతో ఇవ్వనున్నారు. ఒక్కో లబ్దిదారుడికి రూ.4లక్షల వరకు మంజూరు కానుంది. దీని కోసం ఏప్రిల్ 05 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
తాజాగా అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఏప్రిల్ 05 వరకు దరఖాస్తులను స్వీకరించి ఏప్రిల్ 06 నుంచి మే 30 వరకు పరిశీలన చేయనున్నారు. జూన్ 02న రుణాలను ప్రభుత్వం మంజూరు చేయనుంది. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. ఆన్ లైన్ పోర్టల్ లో అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకొని ప్రజాపాలన మండల కార్యాలయంలో దరఖాస్తును ఇవ్వాలని సూచించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. అన్ని క్యాలెండర్ డేట్ల ప్రకారమే జరగాలని సీఎం చెప్పినట్టు గుర్తు చేశారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.