ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో దారుణం జరిగింది. ఓ ప్రముఖ కాలేజీకి చెందిన ఇంటర్ విద్యార్థిని(16) ని రాత్రివేళ పట్టణంలోని అజరయ్యపేట సమాధుల వద్దకు లాక్కు వెళ్లారు మైనర్ బాలురులు. గంజాయి మత్తులో ఉన్న ఇద్దరు యువకుల వద్ద నుంచి పెనుగులాడి చాలా చాక చక్యంతో తప్పించుకుంది బాలిక.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/rape-1.jpg)
ఓ ప్రముఖ కాలేజీ నుంచి ఇంటికి వెళుతున్న బాలిక బ్యాగును వేరొకరికి అందించి బలవంతంగా తీసుకువెళ్లారు బాలురు. ఇక ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు… ఇద్దరు యువకులను పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతే కాదు… ఫో క్సో కేసు నమోదు చేసి విచారిస్తున్నారు పోలీసులు. ఇక ఈ సంఘటన బయటకు రావడంతో… ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో అమ్మాయిలు బయటకు రావడానికి జంకుతున్నారు. ఇక ఈ సంఘటన పైన ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.