త్వరలో తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడు రానున్నట్లు ప్రకటించారు కిషన్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందే కొత్త అధ్యక్షుడు వస్తాడని తెలిపారు.. బీఆర్ఎస్‌తో కలవాల్సిన అవసరం మాకు లేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య అంతర్గత సంబంధం ఉందని ఆరోపనలు చేశారు. తెలంగాణ అభివృద్ధికి రూ.10 లక్షల కోట్లు ఖర్చు చేస్తామన్నారు కిషన్ రెడ్డి.

హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని సీరియస్ అయ్యాడు. కాంగ్రెస్ పాలనపై అన్ని వర్గాలు అసంతృప్తితో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ మాటలను నమ్మి ఓటేసినందుకు ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. పేదలను పట్టించుకోనందుకే బీఆర్ఎస్ పాలన నుంచి ప్రజలు మార్పు కోరుకున్నారని వివరించారు. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదన్నారు కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చేలా ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు.