కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. తిరువూరు లో స్థానిక నేత రమేష్ రెడ్డి పై కొలికిపూడి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రమేష్ రెడ్డిపై రెండు రోజుల్లో చర్యలు తీసుకోవాలని.. లేని పక్షంలో తన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తానంటూ అధిస్టానానికి అల్టిమేటం జారీ చేశారు. దీంతో ఆయన వ్యవహారం పై అధిష్టానం దృష్టి సారించింది. నివేదిక ఇవ్వాలని ఎంపీ, జిల్లా అధ్యక్సుడు సమన్వయకర్తకు సూచించింది.
దాదాపు 10 నెలలుగా తిరువూరులో జరిగిన ఘటనలపై పూర్తి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. టీడీపీ నేత రమేష్ రెడ్డి ఓ గిరిజన మహిళతో అసభ్యంగా మాట్లాడారంటూ ఫోన్ కాల్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో రమేష్ రెడ్డి తీరుపై స్తానిక గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో రమేష్ రెడ్డి వ్యవహారం పై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు సంచలనం వ్యక్తం చేశారు.