ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు పీక కోసి కర్కశంగా హత్య చేశారు. అక్కడితో ఆగకుండా ఆమె పై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఈ దుర్మార్గపు చర్య ఏలూరు నగరంలోని వెన్నవల్లివారిపేటలో శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. వివరాల్లోకి వెల్లితే.. వెన్నవల్లివారిపేటలో సేనాపతి రమణయ్య(64) వృద్ధురాలు స్తానికంగా వడ్డీ వ్యాపారం చేస్తూ జీవిస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున ఆమె ఉంటున్న ఇంటి నుంచి పొగలు రావడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
లోపల వృద్దురాలు రమణమ్మ కాలిన స్థితిలో మరణించి ఉండటాన్ని గమనించారు. విషయం తెలియగానే ఏలూరు జిల్లా ఇన్ చార్జీ ఎస్పీ అద్నాం నయిం అస్మి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్, జిల్లా ఇన్ చార్జీ ఎస్పీ అద్నాం భాషా ఇంటిలోపల బయల పూర్తిగా పరిశీలించారు. ఈ ఘాతుకానికి పాల్పడిన వారిని పట్టుకుంటామని తెలిపారు ఎస్పీ. ప్రాథమిక విచారణలో భాగంగా బంధువుల వద్ద నుంచి వివరాలను సేకరించామని.. పీక కోసి ఆపై పెట్రోల్ పోసి నిప్పు అంటించినట్టు ప్రాథమికంగా వెల్లడి అయిందని తెలిపారు పోలీసులు.