ఏపీకి మోడీ సర్కార్ ఊహించని షాక్ ఇచ్చింది. కడప స్టీల్ ప్లాంట్ పై సంచలన ప్రకటన చేసింది కేంద్ర సర్కార్. ఇవాళ కడప స్టీల్ ప్లాంట్ గురించి లోక్సభ ప్రశ్న లేవనెత్తారు జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి. విభజన చట్టం ప్రకారం కడప స్టీల్ ప్లాంట్ హామీ ఉందని, కేంద్రం ఈ విషయంపై ఏం చేస్తుందని ప్రశ్నించారు జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి.
అయితే..ఇవాళ కడప స్టీల్ ప్లాంట్ గురించి లోక్సభ ప్రశ్న లేవనెత్తిన జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరికి… కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఆ కడప స్టీల్ ప్లాంట్ తమ ముందు లేదని వెల్లడించారు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి. ఒకవేళ ఏదైనా ప్రతిపాదన వస్తే పరిశీలిస్తామని వెల్లడించారు కేంద్ర ఉక్కుశాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి.