ఏపీలో కొత్త సర్వే జరుగనుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కు సంబంధించి చంద్రబాబు కూటమి ప్రభుత్వం సర్వే నిర్వహించనుంది. ప్రతి ఇంట్లో 18 నుంచి 50 ఏళ్ల లోపు ఉన్నవారి వివరాల సేకరించనున్నారు. గ్రామ వార్డ్ సచివాలయ ఉద్యోగుల తో సర్వే నిర్వహించనున్నారు. టెక్నీకల్ స్కిల్…విద్యార్హతలు.. ప్రస్తుతం చేస్తున్న పని కి సంబంధించి వివరాల సేకరణ ఉంటుంది. వచ్చే నెల 10 వరకు సర్వే ప్రభుత్వం నిర్వహించనుంది.

వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ మరింత అభివృద్ధి పై ప్రభుత్వం దృష్టి పెట్టనుంది. ప్రస్తుతం చేస్తున్న వర్క్ తో పాటు మెరుగైన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. సర్వే తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కు ఎక్కువ మంది ఆసక్తి చూపితే ప్రత్యేక సెంటర్ లు ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.. బ్రాండ్ బ్యాండ్ కనెక్టవిటీ.. స్పీడ్ ఇంటర్ నెట్..తగిన వసతి కల్పన పై ప్రభుత్వం దృష్టి పెట్టింది.